Odela 2: తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఓదెల 2 పోస్టర్..! 1 d ago
మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న ఓదెల 2 మూవీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని సృష్టిస్తోంది. నేడు తమన్న పుట్టిన రోజు సందర్భంగా ఆమె భీకరమైన నాగ సాధు లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్లు. ఆమె పుర్రెల పై అధికారంతో నడుస్తుండగా రాబందులు ఆమె పై తిరుగుతున్నట్లు పోస్టర్ లో చూపించారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వం లో సంపత్ నంది నిర్మిస్తున్నారు.